శంకర్, చరణ్ ల భారీ ప్రాజెక్ట్ కు స్టార్ డైలాగ్ రైటర్.!

Published on Jul 13, 2021 4:02 pm IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ ల కాంబోలో ఓ భారీ పాన్ ఇండియన్ చిత్రం అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు శంకర్ చేసిన “ఇండియన్ 2” విషయంలో లైన్ క్లియర్ అవ్వడంతో శంకర్ ఈ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరో అధికారిక అప్డేట్ బయటకి వచ్చింది. ఈ చిత్రానికి ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా వర్క్ చేస్తున్నారని తెలిపారు. “జెంటిల్ మేన్ సినిమా చూసినప్పుడు శంకర్ గారితో ఓఫోటో దిగితే ఈజీవితానికి చాలనుకున్నాను ..ఇప్పుడాయన సినిమాకి మాటలు రాస్తున్నాను..” అని సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు.

ఇప్పటికే సాయి మాధవ్ ఆల్రెడీ మరో భారీ పాన్ ఇండియన్ చిత్రం “RRR” లో కూడా చరణ్ కి మాటలు అందించారు. మరి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కి ఎలాంటి మాటలు అందిస్తారో అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ బెంచ్ మార్క్ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

https://twitter.com/saimadhav_burra/status/1414826984077598721?s=20

సంబంధిత సమాచారం :