సునీల్ కెరీర్ పై ఫోకస్ పెట్టిన స్టార్ డైరెక్టర్

Published on Jun 8, 2019 11:31 pm IST

స్టార్ కమెడియన్ వెలుగొందుతున్న సమయంలో సునీల్ “అందాల రాముడు” మూవీతో హీరో గా మారి” మర్యాద రామన్న”, “పూలరంగడు” వంటి వరుసవిజయాలతో ఓ రేంజ్ హీరో గా ఎదిగారు. ఐతే తరువాత ఆయన చేసిన అరడజనుకుపై చిత్రాలు పరాజయం పొందాయి. దీనితో సునీల్ మళ్ళీ ఫుల్ టైం కమెడియన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్త్తున్నాడు. ఈ బాధ్యతను త్రివిక్రమ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ గత చిత్రం “అరవింద సమేత వీరరాఘవ” లో ఎన్టీఆర్ కి సపోర్ట్ ఇచ్చే స్నేహితుడి పాత్ర చేసే అవకాశం సునీల్ కి ఇచ్చారు. అలాగే ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న మూవీలో లో కూడా హిలేరియస్ కామెడీ కి ఆస్కారం ఉన్న ఓ మంచి కామెడీ రోల్ ని సునీల్ కొరకు ప్రత్యేకంగా రాశారంట త్రివిక్రమ్.

సునీల్ తివిక్రమ్ మంచి స్నేహితులు, సునీల్ కెరీర్ ప్రారంభంలో కూడా త్రివిక్రమ్ రైటర్ గా దర్శకునిగా తాను చేసిన సినిమాలలో మంచి పాత్రలు సునీల్ కొరకు చక్కగా మలిచారు. నువ్వునాకు నచ్చావ్,మన్మధుడు,మల్లీశ్వరి,జై చిరంజీవ, నువ్వే నువ్వే,జల్సా వంటి సినిమాలో సునీల్ పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. సునీల్ టాలెంట్ కి త్రివిక్రమ్ సపోర్ట్ తోడవడంతో సునీల్ స్టార్ కమెడియన్ అయ్యారు. ప్రస్తుతము కెరీర్ పరంగా కొంచెం డౌన్ అయిన సునీల్ లైఫ్ ని చక్కపెట్టే బాధ్యత మళ్ళీ త్రివిక్రం తీసుకున్నారనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :

More