‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా స్టార్ డైరెక్టర్ !

Published on May 26, 2018 9:26 am IST

అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మల చిత్రం ‘ఆఫీసర్’ అన్ని పనుల్ని పూర్తిచేసుకుని జూన్ 1న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక ఈ నెల 28వ తేదీన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు ఒక స్టార్ డైరెక్టర్ ను ముఖ్య అతిథిగా రానున్నారట.

ఆయన మరెవరో కాదు ఇటీవలే ‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందించిన సుకుమార్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సుకుమార్ ను ప్రత్యేకంగా వేడుకకు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. నాగార్జున పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరీన్ కథానాయకిగా కనిపిచనుంది. కర్ణాటకకు చెందిన ఐపిఎస్ ఆఫీసర్ కె.ఎం.ప్రసన్న జీవితం ఆధారంగా సినిమాలోని నాగార్జున పాత్రను డిజైన్ చేశారు వర్మ.

సంబంధిత సమాచారం :