రేపు హైద్రాబాద్‌కు గ్రేట్ డైరెక్టర్!

రేపు హైద్రాబాద్‌కు గ్రేట్ డైరెక్టర్!

Published on Apr 14, 2015 5:00 PM IST

mani-ratnam
మణిరత్నం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రోజు రానే వస్తోంది! ఈ శుక్రవారం తమ అభిమాన దర్శకుడి సినిమాను చూసేందుకు మణి అభిమానులు ఇప్పటికే సిద్ధమైపోయారు. దేశం గర్వించదగ్గ చిత్ర దర్శకుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న మణిరత్నం.. గత కొంతకాలంగా తన మార్క్ సినిమాని తీయలేకపోయారు. అయితే ఈ సారి మాత్రం మళ్ళీ తన మ్యాజిక్ రిపీట్ చేస్తాడనే నేపథ్యంలో విడుదలవుతోన్న సినిమా ఓకే కన్మణి (ఓకే బంగారం). తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్ టీజర్స్ చూసిన ప్రతి ఒక్కరూ ‘మణిరత్నం ఈజ్ బ్యాక్’ అంటున్నారు. రెహమాన్ పాటలు ఇప్పటికే సంగీత ప్రియుల చెవుల్లో మోగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్, ప్రమోషనల్ కార్యక్రమాలను రేపు హైద్రాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్‌తో పాటు సినిమా యూనిట్ పాల్గొననుంది. ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.

తాజా వార్తలు