ఇంకా బాలయ్య వెనుకే పడుతున్న స్టార్ డైరెక్టర్ !

Published on Jul 20, 2018 6:00 pm IST

బాలకృష్ణ హీరోగా నిర్మాత సి.కళ్యాణ్ వివి వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలయ్యతో తమ చిత్రాన్ని మొదలుపెట్టాలని వినాయక్, సి కళ్యాణ్ భావించారు. కానీ ఇంతవరకు కథ సెట్ అవ్వకపోవడంతో ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించట్లేదు. ఈ లోగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుతో తన తర్వాతి చిత్రం చెయ్యటానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం కూడా బాలయ్య ప్రొడక్షన్ హౌస్ లోనే రూపొందనుంది. సినీవర్గాల సమాచారం ప్రకారం బాలయ్య బోయపాటి చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయిందట.

మరి బాలయ్యతో సినిమా చేద్దామనుకుంటున్న వినాయక్ పరిస్థితి ఏమిటి ? ఆయన మాత్రం ఇంకా బాలయ్యకు కథ చెప్పి ఒప్పించేపనిలోనే ఉన్నారు. పరుచూరి బ్రదర్స్ దగ్గరనుంచి కొంతమంది కొత్త రైటర్స్ దాకా చాలామంది దగ్గర కథలు విన్నా అయినా ఇంతవరకు ఇంకా ఏది ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది. ఇప్పటికీ వినాయక్ బాలయ్యకు నచ్చే కథ తీసుకెళ్లి త్వరగా సినిమా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More