స్టార్ డైరెక్టర్ కూతురికి అడల్ట్‌ పిచ్చి !

Published on Feb 20, 2020 4:17 pm IST

అడల్ట్‌ స్టార్‌ గా మారాలని ఏకంగా ఓ స్టార్ డైరెక్టర్ కుమార్తె నిర్ణయించుకుంది. హాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌ కూతురు మికేలా అడల్ట్‌ స్టార్‌ గా మారాలని నిర్ణయం తీసుకుంది. మరి మికేలా నిర్ణయం పట్ల స్పీల్‌బర్గ్‌ ఫీలింగ్ ఎలా ఉందో తెలుయదు గాని నెటిజన్లు మాత్రం మికేలా నిర్ణయాన్ని తప్పు బడుతున్నారు.

ఇంతకీ ఈ మికేలా స్పీల్‌ బర్గ్‌ కన్న కూతురు కాదు. స్పీల్‌ బర్గ్‌ ఆయన భార్య కేట్‌ కాప్షా మికేలాను దత్తత తీసుకున్నారు. ఇక ప్రస్తుతం మికేలా సొంతంగా అడల్ట్‌ వీడియోలను కూడా నిర్మించే పనిలో ఉన్నారు. ఇక ఈ వృత్తి పట్ల ఆమె మాట్లాడుతూ.. వ్యామోహం అనేది సిగ్గుపడే విషయం కాదని, అడల్ట్‌ ఎంటర్ టైన్మెంట్ లో తానూ కెరీర్‌ ను చేపట్టానని ఇది తను తీసుకున్న మంచి నిర్ణయమని ఈమె చెప్పుకొచ్చింది.

అన్నట్టు తన నిర్ణయం పట్ల స్పీల్‌బర్గ్‌ దంపతులు విస్మయం చెందలేదని.. అలాగే తనకు కాబోయే భర్త చక్‌ పాంకో (47) కూడా తనను అడల్ట్‌ స్టార్‌ గా చూడటానికి పూర్తి మద్దతు ఇస్తున్నాడని ఆమె తెలిపింది. మొత్తానికి చక్‌ పాంకో ఇస్తోన్న మద్దతు అడల్ట్‌ వరల్డ్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది.

సంబంధిత సమాచారం :

X
More