ఆ ‘లేడి డైరెక్టర్’కి స్టార్ హీరో ఛాన్స్ ఇచ్చింది అందుకేనా ?

Published on Jul 18, 2018 12:54 pm IST

సినిమా దర్శకత్వం అనేది ఎంతో విజన్ తోను, ఎంతో ఒత్తిడితోను కూడుకున్నది. అందుకే సినిమా దర్శకత్వ విభాగంలో ఆడవారు తక్కువుగా కనిపిస్తారు. కానీ ఆ మధ్య ఒక లేడి దర్శకురాలు మాత్రం తెలుగు, తమిళ భాషల్లో ఓ సూపర్ హిట్ చిత్రం తీసి మంచి విజయాన్ని అందుకుంది. ఆమే, దర్శకురాలు సుధా కొంగర. కాగా ఈమె దర్శకత్వంలో తమిళ స్టార్ సూర్య ఓ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే.

ఐతే వరుసగా సినిమాలతో వెరీ బిజీగా ఉన్న సూర్య, ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ‘ఎన్జీకే’ చిత్రంలో, కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో చిత్రంలో ఆ తర్వాత దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రంతో.. ఇలా సూర్య వరుస చిత్రాలతో బిజీగా ఉన్నా, డేట్లు ఎడ్జెస్ట్ చేసుకుని మరి సుధా కొంగర చిత్రంలో నటించడానికి అంగీకరించారట. కారణం ఆమె చెప్పిన ఓ పిరియాడికల్ నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.

ఆ కథ సూర్యకి బాగా నచ్చడంతో సూర్య సుధా కొంగర కు ఛాన్స్ ఇచ్చారని సమాచారం. అయితే సూర్య ఇప్పటివరకు పని చేసిన దర్శకులు అందరూ మగవారే, ఒక లేడీ దర్శకురాలితో సూర్య పని చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More