‘ముని’ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘కాంచన’ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించి తెరకెక్కించిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని ఎప్పటినుండో హిందీ లో రీమేక్ చేద్దాం అనుకుంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి ఆయన డేట్స్ కూడా సర్దుబాటు చేసుకున్నాడని సమాచారం.
ఇక ఈ హిందీ రీమేక్ కూడా లారెన్స్ దర్శకత్వం వహించే అవకాశాలు వున్నాయట. త్వరలోనే ఈచిత్రాన్నిసెట్స్ మీదకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నారట .


