ఆ సినిమా రీమేక్ లో స్టార్ హీరో !

25th, March 2018 - 01:11:45 PM

తెలుగులో మంచి విజయాలు సాధించిన సినిమాలు తమిళ్ లో రీమేక్ అవుతుంటాయి. తాజాగా వేణు ఉడుగుల దర్శకత్వంలో వచ్చిన నీది నాది ఒకే కథ సినిమా గత శుక్రవారం విడుదలై మంచి విజయం సాధించింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ సినిమా నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటర్ గా పనిచెయ్యడం జరిగింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాను తమిళ్ లో నిర్మాత కాలైపులి దాస్ రీమేక్ చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న ఈ సినిమాను నిర్మాత చెన్నై లో చూడ్డం జరిగిందని సమాచారం. ధనుష్ అయితే ఈ సినిమాకు బాగుంటాడని నిర్మాత ధనుష్ ను సంప్రదించడం జరిగిందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన పూర్తి క్లారిటి వచ్చే అవకాశం ఉంది. నీది నాది ఒకే కథ విడుదల తరువాత శ్రీ విష్ణు కు మంచి పేరు రావడమే కాకుండా నటుడిగా మంచి గుర్తింపు లభించింది.