ఆగష్టులో పవర్ ఫుల్ పోలీస్ గా రాబోతున్న స్టార్ హీరో !

ఆగష్టులో పవర్ ఫుల్ పోలీస్ గా రాబోతున్న స్టార్ హీరో !

Published on Jul 1, 2018 5:20 PM IST

Saamy

మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తమిళ స్టార్ ‘చియాన్ విక్రమ్’ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘సామీ స్క్వేర్’ చిత్రం. ఈ సీజన్లో ఎపుడెపుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలో విక్రమ్ డ్యూయెల్ రోల్ లో అందుకోనూ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. 2003లో విడుదల అయిన సామి పార్ట్ వన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 24 వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శిబూ తమీన్స్ నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు