వైరల్ న్యూస్: ఆ స్టార్ హీరో టీవీ ఛానల్ ప్రాంభించబోతున్నాడంట

Published on May 16, 2019 12:53 am IST

స్టార్ హీరోస్ ఏంచేసినా అదో పెద్ద వార్త ఐపోతుంది. అలాంటింది ప్రభాస్ లాంటి నేషన్ పాపులారిటీ ఉన్న హీరో ఏం చేసినా అది సెన్సషనే. అలాంటి ఓ సెన్సేషన్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే ప్రభాస్ కొందరు సన్నిహితులతో కలిసి ఓ టీవీ ఛానల్ ప్రారంభించబోతున్నారట. ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటనలు ప్రభాస్ కానీ ఆయన సన్నిహితులు కానీ చేయలేదు. కానీ అప్పుడే కొన్ని మీడియా చానెల్స్ ఈ వార్తను వండివార్చేస్తున్నాయి. సాధారణంగా పాలిటిక్స్ లోకి రావాలనుకొనే నటులు, రాజకీయనాయకులు టీవీ చానెల్స్ ప్రారంభిస్తూ ఉంటారు. మరి ఏ ఉద్దేశంతో ఆయన టీవీ ఛానల్ ప్రారంబించాలనుకుంటున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “సాహో” మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని తెలుగు మరియు హిందీతో పాటు మరికొన్ని భారతీయ భాషలలో విడుదల చేయనున్నారు. సుజీత్ దర్సకత్వం వహిస్తున్న ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More