పల్లెటూరి తాతగా కనిపిస్తోన్న స్టార్ హీరో !

Published on Jul 8, 2018 6:22 pm IST

అక్కినేని నాగార్జున పాత కాలం కళ్లజోడు ఒకటి పెట్టుకొని, తెల్లగడ్డంతో అచ్ఛం ఓ పల్లెటూరి పెద్దాయనలా దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాగార్జున పక్కన ఓ అమ్మాయి కూడా ఉంది. కాగా నాగార్జునను పల్లెటూరు తాత గెటప్ లో చూసి నాగ్ అభిమానులతో పాటుగా నెటిజన్లు కూడా గెటప్ బాగుందని ఆ ఫోటోని షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.

కానీ నాగార్జున అసలు ఈ గెటప్ ఏ సినిమా కోసం వేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఐతే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్ ‘దేవదాస్’ చిత్రంలోది ఈ గెటప్ అని తెలుస్తోంది. ఏమైనా చిత్రబృందం అధికారికంగా చెబితే గానీ పూర్తిగా నమ్మలేం. ఇక ఇప్పటికే రిలీజైన ‘దేవదాస్’ టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. రోజురోజుకు ‘దేవదాస్’ చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :