‘ఆర్ఆర్ఆర్’లో స్టార్ హీరోయిన్ నటించట్లేదు !

‘ఆర్ఆర్ఆర్’లో స్టార్ హీరోయిన్ నటించట్లేదు !

Published on May 14, 2019 12:00 AM IST

రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ త్వరలో షూట్ కి రెడీ కాబోతుంది. అయితే స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అనుష్క ‘ఆర్ఆర్ఆర్’లో నటించట్లేదని తెలిసింది.

కాగా రామ్ చరణ్ కు గాయం అవ్వడం కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’లో ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు