స్టార్ హీరోయిన్ రకుల్ కు కరోనా పాజిటివ్.!

స్టార్ హీరోయిన్ రకుల్ కు కరోనా పాజిటివ్.!

Published on Dec 22, 2020 3:02 PM IST

Rakul9

గత ఏడాది చివర్లో వచ్చిన కరోనానే అనుకుంటే మళ్ళీ ఈ ఏడాది చివర్లో కొత్తరకం గా కరోనా మారుతుండడంతో జనాలు తలలు పట్టుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో తీరని నష్టాలే జరిగాయి. సినీ ఇండుస్ట్రీలలో కూడా అనేకం చోటు చేసుకున్నాయి. ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖుకులకు పాజిటివ్ వచ్చిన సంగతి మనం చూసాం.

ఇక లేటెస్ట్ గా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు గాను కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కూడా తానే వెల్లడించింది. అయితే ఈ మధ్య కాలంలో రకుల్ ఫ్యామిలీ ట్రిప్ వేసిన సంగతి తెలిసిందే. అలాగే అక్కడ నుంచి షూటింగులు అని ముంబై, హైదరాబాద్ లలో ఎన్నో లొకేషన్స్ లో తిరిగింది.

మరి అలా తనకి కరోనా సంక్రమించి ఉండొచ్చు. ఇక ఇదిలా ఉంటే రకుల్ తనను ఈ మధ్య కాలంలో ఎవరైతే కలిసారో తాను ఎవరిని కలిసానో వారంతా టెస్ట్ చెయ్యించుకోవాలని కోరింది. అంతే కాకుండా సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిన రకుల్ కరోనా తో పోరాడి అంతే స్ట్రాంగ్ గా మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటానని తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు