కాజల్ ఆ సినిమాలో జాయిన్ అయ్యేది ఎప్పుడంటే..!
Published on Jul 1, 2017 11:38 am IST


నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. కాగా రెండవ షెడ్యూల్ రేపటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్ గా నటించనున్న కాజల్ రేపటి నుంచి షూటింగ్ లో జాయిన్ కానుంది. ఎమ్ ఎల్ ఏ అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని భరత్ చౌదరి మరియు కిరణ్ కుమార్ రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook