వారసుడ్ని సిద్ధం చేస్తున్న స్టార్ హీరో !

వారసుడ్ని సిద్ధం చేస్తున్న స్టార్ హీరో !

Published on Jun 21, 2018 9:52 AM IST

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం పాత సంప్రదాయమే. దీని ద్వారానే చాలా మంది సీనియర్ హీరోల కుమారులు సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోలుగా ఎదిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాదిన ఈ పద్దతి కొంచెం ఎక్కువే. ప్రస్తుతమున్న మన యువ స్టార్ హీరోల్లో చాలా మంది ఒకప్పటి హీరోల పిల్లలే.

వీళ్ళ జాబితాలోకి త్వరలో మరో స్టార్ హీరో కుమారుడు చేరనున్నాడు. అతను మరెవరో కాదు తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు సంజయ్. ఇటీవలే చెన్నైలో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసుకున్న సంజయ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఇంకొన్ని రోజుల్లో కెనడా వెళ్లనున్నాడట. అంటే త్వరలో దక్షిణాదిలోకి మరొక స్టార్ వారసుడికి ఎంట్రీకి ఇప్పటి నుండే రంగం సిద్డమవుతుందన్నమాట. మరి ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేయనున్న సంజయ్ హీరో అవుతాడా లేకపోతే దర్శకుడిగా మారతాడా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు