రికార్డు ధరకి సందీప్ సినిమా శాటిలైట్ రైట్స్

Published on Nov 9, 2019 1:23 pm IST

నినువీడని నీడని నేనే అంటూ భయపెట్టి హిట్ అందుకున్నారు యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ సారి సందీప్ కామెడీ లాయర్ గా అందరిని నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఆయన నటించిన తాజా చిత్రం తెనాలిరామకృష్ణ బి ఏ బి ఎల్ ఈనెల 15న విడుదల కానుంది. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, అగ్రహారం నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. కాగా తెనాలి రామకృష్ణ మూవీ తెలుగు రాష్ట్రాలలో రికార్డ్ ప్రీ రిలీజ్ బిసినెస్ చేసిందని సమాచారం. అలాగే ఇంకా కొద్దిరోజులలో విడుదల వుంది అనగా స్టార్ మా ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ రైట్స్ భారీ ధర చెల్లించి దక్కించుకొందని సమాచారం.

ఈ మూవీకి చెందిన డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఏకంగా 3కోట్ల రూపాయలు చెల్లించి దక్కించుకుంది. సందీప్ గత చిత్రాల రైట్స్ ధరతో పోల్చుకుంటే ఇది చాలా మొత్తం అని చెప్పాలి. ఇక ఈ చిత్రంతో చాలా రోజుల తరువాత హన్సిక తెలుగులో సందడి చేయనుంది. ఈమె కూడా ఈ చిత్రంలో లేడీ లాయర్ పాత్ర చేస్తుంది. తెనాలి రామ కృష్ణ బి ఏ బి ఎల్ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More