పవన్ కు కథ చెప్పబోతున్న స్టార్ రైటర్ !

పవన్ కు కథ చెప్పబోతున్న స్టార్ రైటర్ !

Published on Dec 1, 2020 2:00 AM IST

పవర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కోసం బండ్ల గ‌ణేష్, ప్రస్తుతం కథను వెతికే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఓ తమిళ యువ రచయిత దగ్గర, బండ్ల ఒక కథను ఓకే చేసినట్లు వార్తలు వచ్చినా అది నిజం కాదు అని తేలిపోయింది. అయితే రచయిత కోన వెంకట్ త్వరలో పవన్ కు ఓ కథ వినిపించనున్నారట. కథలో పవన్ పాత్ర కాస్త కొత్తగా ఉంటుందని.. కాలేజీ లెక్చరర్ గా పవన్ సినిమాలో కనిపిస్తారని తెలుస్తోంది.

మరి కాలేజీ నేపథ్యంలో సినిమా అంటే.. అది పవన్ లెక్చరర్ పాత్ర అంటే.. ఆసక్తి రెట్టింపు అయ్యేలా ఉంది. మొత్తానికి బండ్లకు పవర్ స్టార్ ఎట్టకేలకూ మళ్లీ ఓ సినిమాని నిర్మించే అవకాశం ఇచ్చాడు. ఆ మాటకొస్తే ఎప్పటి నుండో బండ్లకు పవన్ తో మళ్ళీ మరో సినిమా చేయాలని ఉంది. కానీ కుదరలేదు. వచ్చే ఏడాది వీరి కలయికలో సినిమా రాబోతుంది. మరి ఎలాంటి సినిమా రాబోతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు