
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం గుంటూరులో జరగనుంది. ఈ కార్యక్రమానికి పలువురు స్టార్స్ కూడా హాజరు కానున్నారు.
పార్టీ తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ తో పాటు నందమూరి హీరోలైన జూ.ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణ మరియు ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హాజరు కానున్నారు. వీరితో పాటు ఇండస్ట్రీ నుంచి మురళి మోహన్, బాబు మోహన్, అలీ మరియు మరికొంతమంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.