మహానాయకుడు ప్రీమియర్ షోలో ప్రముఖులు !

Published on Feb 21, 2019 7:20 pm IST

రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘మహానాయకుడు’ సిద్ధమయ్యాడు. కాగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మహానాయకుడు ప్రీమియర్ షో వేసింది చిత్రబృందం. ఈ షోకు బాలయ్య అలాగే ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు ఎన్టీఆర్ చిత్రబృందంతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వివి వినాయక్, పూరి జగన్నాధ్, చార్మి , తమ్మారెడ్డి భరద్వాజ్, యస్ గోపాల్ రెడ్డి, సురేశ్ బాబు, యువ దర్శకులు వెంకీ అట్లూరి, అజయ్ భూపతి, చందు, నాగ అశ్విన్, పరుచూరి గోపాలకృష్ణ, ఇక సినిమా రిజల్ట్ రాత్రి తొమ్మిది గంటలకు కల్లా తెలియనుంది.

ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఎన్టీఆర్ ‘కథానాయకుడు’ మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. దాంతో చిత్రబృందం ‘మహానాయకుడు’ ఫైనే ఆశలన్నీ పెట్టుకుంది.

కాగా కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ తో పాటు, వారాహి ప్రొడక్షన్స్ మరియు విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఫిబ్రవరి 22వ తేదీన మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సంబంధిత సమాచారం :