డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన కరణ్.

Published on Jul 25, 2019 4:06 pm IST

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రానికి బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. డియర్ కామ్రేడ్ చిత్రం విజయం సాధించాలని ఆయన ఆకాక్షించారు. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీలో కరణ్ రీమేక్ చేయనున్నారు. దీనికి సంబంధిన అధికారిక కార్యక్రమాలు సైతం పూర్తికావడం జరిగింది. ఒక దశలో హిందీ రీమేక్ లో కూడా విజయ్ నటిస్తాడనే వార్తలు వచ్చినప్పటికీ, అందులో వాస్తవం లేదని తెలిసిపోయింది.

అలాగే దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, ఇషాన్ లు ఈ మూవీలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ధఢక్ చిత్రంతో వెండి తెరకు పరిచయ్యారు ఐతే నిర్మాత కరణ్ తన ట్వీట్ లో ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. డియర్ కామ్రేడ్ చిత్రం కోసం ఏ స్టార్స్ ని కలవడం కానీ, పేర్లు పరిశీలించడం కానీ జరగలేదని ఆయన చెప్పారు. దీనితో డియర్ కామ్రేడ్ హిందీ చిత్రంలో నటించే నటుల ఎంపిక జరగలేదని తెలిసిపోయింది.

సంబంధిత సమాచారం :