జీ 5 లో “స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్” జూలై 9న విడుదల!

Published on Jul 8, 2021 6:32 pm IST

26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ లకు నివాళి గా జీ 5 స్టేట్ ఆఫ్ సీజ్ 26/11 ఎంత విజయం సాధించింది అనేది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మరొకసారి స్టేట్ ఆఫ్ సీజ్ టెంపుల్ అటాక్ పేరుతో ఈ చిత్రం జూలై 9 వ తేదీన జీ 5 లో విడుదల కానుంది. మరి కొన్ని గంటల్లో శుక్రవారం నాడు హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తి తి రూపొందించిన ఈ చిత్రం, భారతీయులకు నివాళి అని, భారతీయుల ధైర్యానికి వందనం అంటూ జీ 5 వర్గాలు చెబుతున్నాయి. అమాయక ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, ఉగ్రవాదులను ధైర్యంగా మట్టుబెట్టేందుకు ఎన్ ఎస్ జి సదా తన సంకల్పాన్ని, సంసిద్ధత ను ప్రదర్శిస్తూనే ఉంటుంది. అయితే ఈ చిత్రం గురించి దర్శకుడు కెన్ ఘోష్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌ టెంపుల్‌ అటాక్‌ ఇది కేవలం సినిమా మాత్రమే కాదు అని, మనల్ని కాపాడేందుకు అనుక్షణం తమ ప్రాణాలను పణంగా పెట్టే ఎన్‌ఎస్‌జీ కమాండోల కి నివాళి ఇది అని వ్యాఖ్యానించారు. నౌకాదళ అధికారి కుమారుడిగా నేను సైనిక దళాల శక్తియుక్తులను చూస్తూ పెరిగాను, స్టేట్ ఆఫ్‌ సీజ్‌ టెంపుల్‌ అటాక్‌ లో మన హీరోలకు నివాళి అర్పించేందుకు మా వంతు కృషి మేము చేశాం అని చెప్పుకొచ్చారు. జీ 5 లో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నాను అని అన్నారు.

సంబంధిత సమాచారం :