ఇంకా ఏదర్శకుడు ఖరారు కాలేదు !

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ఇటివల ఒక్క క్షణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత అల్లు శిరీష్ ఏదర్శకుడితో చెయ్యబోతున్నడనే విషయంపై రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. కాని ఇంకా ఏ దర్శకుడు ఖరారు కాలేదని సమాచారం. ప్రస్తుతం అన్ని చర్చల దశలోనే ఉన్నాయి.

ముందుగా ఈ సినిమాను కొత్త డైరెక్టర్ తో చేద్దాం అనుకున్నారు కాని కుదరలేదు. ప్రస్తుతం గీత ఆర్ట్స్ ఆఫీస్ లో ఈ సినిమాకు సంభందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఇక అల్లు అర్జున్ తన టాలెంట్ తో మంచి స్టార్ డమ్ సంపాదించుకున్నట్లు అల్లు శిరీష్ కూడా ఆ స్థాయికి రావాలని కోరుకుందాం.

Exit mobile version