చిరు-పవన్ వాళ్లిద్దరినీ ఎన్నాళ్లు దాచేస్తారు?

చిరు-పవన్ వాళ్లిద్దరినీ ఎన్నాళ్లు దాచేస్తారు?

Published on Feb 25, 2020 12:57 PM IST

Chiranjeevi Pawan

మెగా స్టార్ చిరంజీవి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. రెండేళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పింక్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక చిరంజీవి దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తన 152వ చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ టచ్ తో సోషల్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ గా తెరకెక్కుతున్నాయి. ఐతే ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ తమ సినిమాలలోని హీరోయిన్స్ ని ప్రకటించలేదు. వీరితో జత కట్టనున్న హీరోయిన్స్ ఎవరై ఉంటారా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిరంజీవి మూవీలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీని గురించి హీరోయిన్ త్రిష కొంచెం హింట్ ఇచ్చారు. చిత్ర యూనిట్ మాత్రం స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇక పవన్ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఇంకా తేలలేదు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాల తక్కువ నిడివి ఉంటుంది. ఈ క్రమంలో హీరోయిన్ తో పవన్ కాంబినేషన్ సీన్స్ చివర్లో తెరకెక్కిస్తారేమో. కారణం ఏదైనా పవన్ కమ్ బ్యాక్ మూవీ హీరోయిన్ ఎవరనేది స్పష్టం కాలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు