“వకీల్ సాబ్”పై ఎటూ ఓ సరైన క్లారిటీ లేకుండా పోయింది!

Published on Apr 16, 2021 10:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్”. పవన్ కం బ్యాక్ చిత్రంగా ఇది భారీ అంచనాల నడుమ గత వారం విడుదల అయ్యింది. మరి ఇదిలా ఉండగా మూడేళ్లు అనంతరం వచ్చిన ఈ భారీ చిత్రం పవన్ స్టార్డం కు తగ్గట్టుగానే భారీ ఓపెనింగ్స్ రాబట్టి ఈ ఉగాది వరకు సాలిడ్ గా నిలిచింది అని తెలిసిందే.

అయితే ఇపుడు ఈ చిత్రం వసూళ్ల విషయంలోనే ఓ సరైన క్లారిటీ లేకుండా పోయింది. ఎందుకంటే ఇప్పటి వరకు బయటకి వచ్చిన ఫిగర్స్ చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా వచ్చినవి కావు జస్ట్ పి ఆర్ టీం నుంచి సినీ వర్గాల్లో నుంచి వచ్చిన వసూళ్లు లెక్కలు మాత్రమే.. దీనితో ఇప్పటి వరకు ఈ చిత్రం నిజంగా ఎంత వసూళ్లు రాబట్టింది అన్న దానిపై ఓ సరైన క్లారిటీ అయితే ఇప్పటికీ లేదు.

ఆల్రెడీ వసూళ్లపై రెండు వెర్షన్లు వినిపిస్తున్నాయి. దీనితో పవన్ అభిమానులు కనీసం ఒక్క పోస్టర్ అయినా ఇప్పటి వరకు ఎంత రాబట్టిందో సింగిల్ ఫిగర్ ను అయినా వదలమంటున్నారు. అయితే పవన్ ఎప్పటి నుంచో తన సినిమాల వసూళ్లను బయట పెట్టడం మానేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :