మెహర్ రమేష్‌కు చిరు అంత ఈజీగా ఏం ఓకే చెప్పలేదు

మెహర్ రమేష్‌కు చిరు అంత ఈజీగా ఏం ఓకే చెప్పలేదు

Published on Sep 25, 2020 1:09 AM IST


మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే దర్శకుడంటే వెనుక మూడు నాలుగైనా పెద్ద హిట్ సినిమాలు ఉండాలి. అప్పుడు చిరుతో చేయబోయే సినిమాకు హైప్, అభిమానుల్లో క్రేజ్ ఉంటాయి. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రెండు సినిమాలను లైన్లో పెట్టారాయన. ఆ రెండు కూడ రీమేక్ సినిమాలే. ఒకటి ‘లూసిఫర్’ రీమేక్ కాగా ఇంకొకటి ‘వేదాళం’ రీమేక్. వీటిలో ‘లూసిఫెర్’ రీమేక్ వివి. వినాయక్ చేతికి వెళ్లగా ‘వేదాళం’ రీమేక్ ఎవ్వరూ ఊహించని విధంగా మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్నారు.

చిరుతో మెహర్ రమేష్ సినిమా అనగానే అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. చిరంజీవి ఏమిటి మెహర్ రమేష్‌కు ఆఫర్ ఇవ్వడమేమిటి అనుకున్నారు. అభిమానులైతే కంగారుపడిపోతున్నారు. ఇలా వాళ్ళు ఆశ్చర్యపడటంలో, కంగారుపడటంలో తప్పేం లేదు. ఎందుకంటే మెహర్ రమేష్ సినిమా చేసి దాదాపు ఏడేళ్లు కావొస్తోంది. 2013లో వచ్చిన ‘షాడో’ ఆయన ఆఖరి చిత్రం. అది కూడ పరాజయం చెందిన సినిమానే. సరే .. అంతకు ముందు ఏమన్నా బ్లాక్ బస్టర్లు ఉన్నాయా అంటే లేవు. ‘బిల్లా’ పర్వాలేదనిపించగా ‘కంత్రి, శక్తి’ ఫ్లాప్ అయ్యాయి. అందుకే అభిమానుల్లో ఆందోళన.

కానీ చిరు మెహర్ రమేష్‌కు అంత ఈజీగా ఏం ఓకే చెప్పలేదు. చిరును ఒప్పించడానికి మెహర్ చాలానే కష్టపడ్డాడు. మెగా కుటుంబంతో మెహర్ రమేష్‌కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో ఆ బంధం ఇంకా బలపడింది. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు సహాయం చేయడం కోసం చిరు కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించి అనేక సహాయ కార్యక్రమాలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఈ ఛారిటీని ముందుకు నడపడంలో చాలామంది కృషి ఉన్నా మెహర్ రమేష్‌ది మాత్రం ప్రత్యేక కృషి అంటారు.

ఫండ్స్ కలెక్ట్ చేయడం దగ్గర్నుండి, కష్టంలో ఉన్నవారిని గుర్తించడం, నిత్యావసరాలు తెప్పించడం, వాటిని సరిగ్గా అవసరం ఉన్న వారికి చేర్చడం ఇలా ఛారిటీ విజయవంతంగా నడవడానికి మెహర్ రమేష్ చాలా కష్టపడ్డారు. ఈ టైంలోనే ఇరువురి మధ్యన ప్రాజెక్ట్ డిస్కషన్ రావడం, కొన్ని నెలలు జర్నీ సాగడం,సుదీర్ఘ చర్చల అనంతరం చిరు ఒప్పుకోవడం జరిగాయి. అంతేకానీ రాత్రికి రాత్రి మెహర్ రమేష్‌కు చిరు ఓకే చెప్పలేదు. అందులోనూ కొన్ని నెలలపాటు చర్చించిన తరువాత చిరు తీసుకున్న నిర్ణయం కాబట్టి అభిమానులు కూడ కంగారుపడాల్సిన పనిలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు