మెగా మల్టీస్టారర్ కు కథ సిద్దమవుతోందట !


మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ‘ ఖైదీ నెం 150’ విడుదల సమయంలో చిరంజీవిని సత్కరించే కార్యక్రమంలో కళాబంధు టి. సుబ్బరామిరెడ్డిగారు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో ఒక మల్టీస్టారర్ తీయాలనుందని, త్వరలోనే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తానని, ఆ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తారని పరిశ్రమ మొత్తం ఆశ్చర్యపడే ప్రకటన చేశారు. దీంతో మెగా అభిమానులు ఎన్నాళ్ళ నుండో దాగి ఉన్న కల నెరవేరబోతోంది సంబరపడ్డారు.

అయితే సుబ్బరామిరెడ్డిగారు తాజాగా ఈ మెగా మల్టీస్టారర్ గురించిన ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఈ సినిమాకు కావలసిన కథ సిద్ధమవుతోందని, అయితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారని, అవి పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్టును భారీ ఎత్తున లాంచ్ చేస్తామని తెలిపారు. అలాగే ఈ చిత్రం తెలుగు పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అవుతుందని కూడాఅన్నారు.