“అఖండ” అవైటెడ్ అప్డేట్ పై స్ట్రాంగ్ బజ్.!

“అఖండ” అవైటెడ్ అప్డేట్ పై స్ట్రాంగ్ బజ్.!

Published on Aug 5, 2021 8:01 AM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “అఖండ” అని అందరికీ తెలిసిందే. తన హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఫిల్మ్ ఇది కావడంతో దీనిపై కూడా ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి ఓ మోస్ట్ అవైటెడ్ అప్డేట్ కోసం అభిమానులు సహా ముఖ్యంగా సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్ కోసం. మంచి స్వింగ్ లో ఉన్న ఎస్ ఎస్ థమన్ సంగీతం ఇస్తున్న ఈ చిత్రం నుంచి మొట్టమొదటి సాంగ్ కోసం చాలా కాలం నుంచే అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ అప్డేట్ తొందరలోనే రానున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

అంతే కాకుండా ఈ సాంగ్ అప్డేట్ తో పాటుగా రిలీజ్ డేట్ విషయంపై కూడా క్లారిటీ రానున్నట్టు నయా టాక్. మరి ఈ రెండు మూడు వారాల్లో వస్తుందేమో అన్నది చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రం నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు