“కేజీయఫ్ 2” రిలీజ్ సమయంపై స్ట్రాంగ్ బజ్.!

Published on Jul 29, 2021 2:33 am IST

రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ సినిమా కోసం ఎంతలా అందరూ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పరిస్థితులు కనుక బాగుండి ఉంటే ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ వరుసగా కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తూనే ఉంది. దీనితో ఈ చిత్రం విడుదల ఎప్పుడు అన్నది కూడా ఎప్పటికప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న లానే మిగిలి వస్తుంది.

అయితే ఇప్పుడు తాజాగా సినీ వర్గాల నుంచి స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. మరి దాని ప్రకారం ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లోకే షిఫ్ట్ అయ్యిందట. ఈ ఇంతకు ముందు కూడా వచ్చింది కానీ ఈసారి ఖాయమే అని తెలుస్తుంది. అలాగే రేపు సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా కూడా ఒక అదిరే అప్డేట్ వస్తుంది అని టాక్ ఉంది. మరి అందులో ఏమన్నా డేట్ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :