స్ట్రాంగ్ బజ్..చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కి ఈమే ఫిక్స్.!

Published on Jul 30, 2021 2:35 pm IST


ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ “రౌద్రం రణం రుధిరం” అలాగే “ఆచార్య” అనే రెండు భారీ మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ చిత్రాల అనంతరం మరో సెన్సేషనల్ పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్ తో ఓ భారీ సినిమాని అనౌన్స్ చేసి ఎనలేని హైప్ ని సొంతం చేస్తున్నాడు.

అయితే ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ మరియు క్యాస్టింగ్ ఫైనలైజేషన్ లో ఉండగా ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా ఎవరు కనిపిస్తారు అన్నది ఓ ఇంట్రెస్టింగ్ అంశంగా మారింది. అయితే ఈ బజ్ కి కియారా అద్వానీ పేరు రాగా మెగా ఫాన్స్ అంతా సుముఖంగానే ఉన్నా మళ్ళీ మరో హీరోయిన్ పేరులు కూడా లైన్ లోకి రాగా వాటిలో దేనితో కూడా మెగా ఫ్యాన్స్ ఏకీ భావించలేకపోయారు.

కానీ ఇప్పుడు లేటెస్ట్ అండ్ స్ట్రాంగ్ బజ్ ఏమిటంటే ఈ భారీ చిత్రంలో చరణ్ సరసన హీరోయిన్ గా నటించేది కియారా అద్వానీనే అట. ఈమె పేరే ఫిక్స్ అయ్యినట్టుగా సమాచారం. సో ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కి ఎలాంటి డిజప్పాయింట్మెంట్ ఉండదని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :