రీ-రిలీజ్‌తో ‘ఖలేజా’ విధ్వంసం.. వరల్డ్ వైడ్‌గా డే 1 వసూళ్లు ఎంతంటే?

రీ-రిలీజ్‌తో ‘ఖలేజా’ విధ్వంసం.. వరల్డ్ వైడ్‌గా డే 1 వసూళ్లు ఎంతంటే?

Published on May 31, 2025 7:02 PM IST

Khaleja 4

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఖలేజా’ చిత్రాన్ని తాజాగా రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో ఈ చిత్ర రీ-రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు తగ్గట్టుగానే ఈ సినిమాకు థియేటర్లలో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

ఖలేజా రీ-రిలీజ్ మేనియాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ఊగిపోతుంది. ఈ చిత్రానికి కళ్లుచెదిరే వసూళ్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఖలేజా రీ-రిలీజ్‌లో తొలి రోజున వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.8.26 కోట్ల మేర గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.

ఒక రీ-రిలీజ్ చిత్రానికి ఈ రేంజ్‌లో కలెక్షన్స్ రావడంతో ఈ మూవీ ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఈ వీకెండ్ ఈ చిత్ర కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అనుష్క శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు