సురేందర్ రెడ్డి కి ప్రశంసల వర్షం !

surender-reddy
సురేందర్ రెడ్డి తన చిత్రాలని స్టైలిష్ గా తెరకెక్కిస్తారన్న పేరుంది. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కించిన ధృవ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి కి ప్రశంసల వర్షం కురుస్తోంది.ఒక రీమేక్ చిత్రాన్ని పర్ఫెక్ట్ గా తెరెకెక్కించారని అందరూ ప్రశంసిస్తున్నారు.

ధృవ చిత్రాన్ని స్టైలిష్ తెరకెక్కించడం, రామ్ చరణ్ లుక్ ని అద్భుతంగా మలచడం లో సురేందర్ రెడ్డి విజయం సాధించారు.ఇప్పుడు ఈ అంశమే సర్వత్రా చర్చగా మారింది. రాంచరణ్ లుక్ పై అతని అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా సురేందర్ రెడ్డి గురించి మరో ఆసక్తికర అంశం ఇప్పుడు వినిపిస్తోంది.ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి మరో చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.