సైలెన్స్ లో సుబ్బరాజు !

సైలెన్స్ లో సుబ్బరాజు !

Published on Dec 27, 2018 8:32 PM IST

Subbaraju

ఈ ఏడాది ప్రారంభంలో ‘భాగమతి’చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది స్టార్ హీరోయిన్ అనుష్క. ఇక ఈ చిత్రం తురువాత చాలా గ్యాప్ తీసుకొని అనుష్క తన కొత్త చిత్రంలో నటించటానికి రెడీ అవుతుంది.

హేమంత్ మధుకర్ తెరకెక్కించనున్న థ్రిల్లర్ మూవీ లో అనుష్క , మాధవన్ తో కలిసి నటించనుంది. ఈచిత్రానికి ‘సైలెన్స్’ అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సుబ్బరాజు ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కోన వెంకట్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈచిత్రం పలు భారతీయ భాషల్లో విడుదలకానుంది.

తాజా వార్తలు