దసరా సందర్భంగా ‘సుబ్రహ్మణ్యపురం’ టీజర్ !

Published on Oct 17, 2018 11:44 am IST


సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో హీరో సుమంత్ కథానాయకుడిగా రాబోతున్న తాజా చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ చిత్రంలో సుమంత్ సరసన ఈషా హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ‘సుబ్రహ్మణ్యపురం ‘ టీజర్ ను దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదల చేయబోతున్నామని హీరో సుమంత్ తన ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘సుబ్రహ్మణ్యపురం’ చిత్రం ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగుతుందని తెలుస్తోంది.

ఇక సుమంత్ కి ఈ చిత్రం 25వ చిత్రం కావడం విశేషం. ఇందులో సుమంత్ ఒక నాస్తికుడిగా తను ఇష్టపడ్డ అమ్మాయి కోసం, ఓ గ్రామం కోసం ఏకంగా దేవుడితోనే పోరాడబోతున్నాడు. ఈ ఆసక్తికరమైన థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ఆర్కే ప్రతాప్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని టారస్ సినీకార్పు మరియు సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి మరియు ధీరజ్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :