‘సక్సెస్ ఫుల్’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ అదేనా ?

Published on Feb 25, 2019 12:00 am IST

అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో, తన మార్క్ డైలాగ్ లతో, కామెడీని హ్యాండిల్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుసగా హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొదట డైలాగ్ రైటర్ గా కెరీర్ మొదలు పెట్టి .. సక్సెస్ ఫుల్ సినిమాల డైరెక్టర్ గా ఎదిగాడు అనిల్ రావిపూడి. ఇటీవలే అనిల్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్ 2’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రెవిన్యూని రాబట్టి ఈ ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి నెక్స్ట్ ఫిల్మ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అనిల్ తన తరువాత చెయ్యబొయ్యే సినిమా కోసం అప్పుడే స్క్రిప్ట్ మొదలు పెట్టినట్లు.. అది కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

కాగా ఆ మధ్య మహేష్ బాబుకి కూడా అనిల్ రావిపూడి స్క్రిప్ట్ చేస్తున్నట్లు, తన తర్వాత సినిమాను మహేష్ బాబుతోనే చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మహేష్ తో సినిమా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయట.. ఆ లోపు ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయాలనీ అనిల్ ప్లాన్ చేస్తున్నాడట.

సంబంధిత సమాచారం :