
సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెలుగు తెరకు పరిచయమైన యువహీరో సుధీర్ బాబు. ‘ఏ మాయ చేశావే’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ‘ప్రేమకథా చిత్రమ్’ సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్యే ‘మోసగాళ్ళకు మోసగాడు’తో మనముందుకొచ్చిన సుధీర్ బాబు, తాజాగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ..’ అంటూ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మాణంలో దర్శకుడు చంద్రు రూపొందించిన ఈ సినిమాపై సుధీర్ బాబు భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో సుధీర్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు. గతంలో ఇంతకుముందెన్నడూ కనిపించని తరహా క్యారెక్టర్‌తో ఈ సినిమాలో కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తన నటన విషయంలో సుధీర్ ఎంతో పరిణతి చూపారని ఇండస్ట్రీ టాక్. క్లీన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ సరసన నందిని హీరోయిన్‌గా నటించింది. జూన్ 19న ఈ సినిమా విడుదల కానుంది.