కోర్టుకెక్కిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర.. కారణం ఏమిటంటే..?

కోర్టుకెక్కిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర.. కారణం ఏమిటంటే..?

Published on Jun 30, 2026 4:55 PM IST

ప్రముఖ లేడీ దర్శకురాలు సుధా కొంగర తనకు రావాల్సిన పారితోషికం కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ‘పరాశక్తి’ చిత్ర నిర్మాతలు తనకు ఇంకా రూ.8.39 కోట్ల రెమ్యునరేషన్ బాకీ ఉన్నారని, ఆ మొత్తాన్ని రికవరీ చేయడంలో కోర్టు జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన హైకోర్టు, జూలై 8న జరగబోయే తదుపరి విచారణ వరకు ‘పరాశక్తి’ సినిమా శాటిలైట్ హక్కులపై ఎలాంటి ముందడుగు వేయరాదని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఆర్థిక వివాదం తేలే వరకు అదే బ్యానర్‌లో రూపొందుతున్న ‘ఇదయం మురళి’ సినిమా విడుదలను కూడా నిలిపివేయాలని సుధా కొంగర కోర్టును అభ్యర్థించారు. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాపై ఆమె స్టే కోరడం గమనార్హం. నిజానికి శివకార్తికేయన్ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి వివాదాలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఈ సినిమా కథపై కాపీరైట్ వివాదం తలెత్తగా, అప్పట్లో విడుదలకు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియలోనూ ఈ ప్రాజెక్ట్ తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంది.

ఎన్నో ఇబ్బందులను దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం, ఇప్పుడు దర్శకురాలి రెమ్యునరేషన్ వివాదంతో మళ్లీ హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది. జూలై 8న జరగనున్న తదుపరి కోర్టు విచారణ ఫలితం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు