సుధీర్ బాబుతో హర్షవర్ధన్ రొమాంటిక్ డ్రామా !

Published on Jul 12, 2021 9:28 am IST

హీరో సుధీర్ బాబు ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి (ఎ యూనిట్ ఆఫ్ ఏషియన్ గ్రూప్) లో నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మాతలుగా సుధీర్ బాబు హీరోగా మరో చిత్రాన్ని చేయబోతున్నాడు.

కాగా ఈ రోజు అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ విభిన్న కాన్సెప్ట్‌ తో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రాబోతుందట. అన్నట్టు సోనాలి నారంగ్, శ్రీష్టి ఈ చిత్రానికి సమర్పకులు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పై రానున్న నాగ చైతన్య లవ్ స్టోరీ విడుదలకు రెడీగా ఉంది. అలాగే శేఖర్ కమ్ముల – ధనుష్ కాంబినేషన్ లో కూడా మరో సినిమా చేస్తున్నారు. ఇంకా కొన్ని క్రేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ ప్రకటించే ఆలోచనలో ఉంది. అయితే సుధీర్ బాబు, హర్షవర్ధన్ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది.

సంబంధిత సమాచారం :