సుధీర్ బాబు సినిమాకు భలే మార్కెట్ తగిలిందిగా..!

Published on Jul 7, 2021 3:00 am IST

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని తేడా లేకుండా ప్రధానంగా కంటెంట్ బాగుంటే చాలు ఏ సినిమా అయిన బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. డిజటల్‌ రైట్స్‌, శాటిలైట్‌, స్ట్రీమింగ్‌ హక్కులు పరంగా కూడా చిన్న సినిమాలు మంచి ఆదాయాన్నే రాబట్టుకుంటున్నాయి. తాజాగా సుధీర్ బాబు హీరోగా న‌టిస్తోన్న ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ సినిమా శాటిలైట్, డిజిట‌ల్ హ‌క్కుల‌ను జీటీవీ గ్రూప్ రూ.9 కోట్లకు ద‌క్కించుకుంద‌న్నట్టు తెలుస్తుంది.

అయితే ఈ ఢీల్‌తో సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసినట్టు సమాచారం. అయితే మొత్తానికి సుధీర్ బాబు తన సినిమాతో విడుద‌లకు ముందే నిర్మాత‌ల‌కు మంచి మార్కెట్ తెచ్చిపెట్టాడని చెప్పాలి. ఇదిలా ఉంటే గోదావ‌రి జిల్లా బ్యాక్ డ్రాప్‌లో సాగనున్న ఈ సినిమాను ప‌లాస సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్ట‌ర్ క‌రుణ్ కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :