మల్టీస్టారర్ నుంచి సీరియస్ లుక్ తో వచ్చిన యంగ్ హీరో !

Published on Aug 5, 2018 6:59 pm IST


యువ హీరోలు నారా రోహిత్‌, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, కలయికలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రం. నూతన దర్శకుడు ఇంద్రసేన. ఆర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ శ్రీయ ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. కాగా వైవిధ్యంమైన కథ కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎవరు ఊహించని విధంగా డిఫరెంట్ గా ఉంటుందట. ఈ ప్రయోగాత్మకమైన చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోందని తెలుస్తోంది.

తాజాగా వీర భోగ వసంతరాయలు చిత్రంలోని సుధీర్ బాబు ఫస్ట్ లుక్‌ని ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్లు అనిల్ భాను విడుదల చేశారు. ఈ లుక్‌లో సుధీర్ బాబు సీరియస్ గా మరియు స్టైలిష్ గా కనిపిస్తోన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. కాగా క్రైమ్ డ్రామాగా థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం సమకూరుస్తుండగా, బాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More