సెన్సేషన్ : జస్ట్ 6 రోజుల్లో కోటి వ్యూస్ తో సుడిగాలి సుధీర్ “పుష్ప” స్కిట్.!

Published on Jan 28, 2022 1:30 pm IST

మన తెలుగు బుల్లితెర వద్ద ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఎంటర్టైనింగ్ ప్రోగ్రాంలకి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండుగల టైం లో అదిరే స్పెషల్ ఈవెంట్ లు వారంలో ప్రతి రోజు ఒక్కో డిఫరెంట్ ఎంటర్టైనింగ్ షో తో తెలుగు ఆడియెన్స్ కి సాలిడ్ ఫీస్ట్ ని వారు అందిస్తున్నారు.

ఇక గురువారం, శుక్రవారం ప్రసారం అయ్యే హిట్ కామెడీ షో లు “జబర్దస్త్” మరియు “ఎక్స్ట్రా జబర్దస్త్” ప్రోగ్రాంల కోసం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు తరగని నవ్వులతో ఫ్యామిలీ ఆడియెన్స్ ని అలరిస్తున్న ఈ షోల నుంచి సుడిగాలి సుధీర్ స్కిట్స్ రెస్పాన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది.

మరి లేటెస్ట్ గా గత వారం వీరు చేసిన స్కిట్ రికార్డు స్థాయి రెస్పాన్స్ ని అందుకొని సెన్సేషన్ ని నమోదు చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా “పుష్ప” కి స్పూఫ్ గా సుడిగాలి సుధీర్ పుష్ప గా రామ్ ప్రసాద్ కేశవగా గెటప్ శ్రీను భన్వర్ సింగ్ షెకావత్ పాత్రల్లో చేసిన ఈ స్కిట్ హిలేరియస్ గా పండడమే కాకుండా..

మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ ని యూట్యూబ్ లో అందుకుంది. కేవలం ఆరు అంటే ఆరే రోజుల్లో ఏకంగా 10 మిలియన్ వ్యూస్ అంటే ఒక కోటి వ్యూస్ తో పాటుగా 2 లక్షలకి పైగా లైక్స్ ని అందుకొని నెవర్ బిఫోర్ రెస్పాన్స్ తో రికార్డు సెట్ చేసింది. ఇక ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షో కి రష్మీ గౌతమ్ యాంకర్ గా చేస్తుండగా రోజా మరియు మనో లు న్యాయ నిర్ణేతలుగా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :