ప్రస్తుత సమాజంలో సూసైడ్ అనేది ఓ బర్నింగ్ పాయింట్. పాస్ కాలేదని విద్యార్థులు, ఉద్యోగం రాలేదని నిరుద్యోగులు,ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువైందని…ప్రేమ దక్కలేదని…, పెళ్ళాం తిడుతుందని..,చిన్న చిన్న సమస్యలకే క్షణికావేశంలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనీ, సమస్యను రెండు వైపులనుండి ఆలోచిస్తే తప్పెవరిదో.., మార్గం ఏమిటో తెలుస్తుందనే విషయాన్ని’సూసైడ్ క్లబ్’ చిత్రంలో చక్కని డ్రామాతో చెప్పారు. చనిపోవడానికి ఒక చోట చేరిన ఆరుగురు వ్యక్తుల కథగా మొదలై, అనుకోని ట్విస్ట్ తో ముగించిన విధానం బాగుంది.
45 నిముషాల నిడివి గల ఈ చిత్రం ఆసక్తిగా సాగుతుంది. ఈ చిత్రాన్ని హిందీ మరియు తెలుగు భాషలలో నిర్మించారు. ఇందులో నటించిన వారంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఆత్మహత్య చేసుకోవాలనే వారికి ఈ ఫిలిం కనువిప్పుకలిగిస్తుంది. ఒకే లొకేషన్‌లో ఒకే టైంలో ఆరుగురు వ్యక్తులతో కథను ఆసక్తిగా నడిపించాడు. అయితే ఇది కేవలం ఓ అవేర్‌నెస్ కోసం తీసిందే. అమెజాన్‌లో ఈ చిత్రంలో చూడవలసింది. దర్శకుడు తనకు తెలిసిన అనుభవంతో ఈ చిత్రాన్ని తీశానడనే చెప్పాలి. అలాగే ఇందులో నటించిన నటీనటులందరూ చాలా న్యాచరల్‌గా మేకప్ లేకుండా చేశారు.
శివ, ప్రవీణ్ మరియు చందన మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సందీప్ రెడ్డి, వెంకట కృష్ణ, సాకేత్ సింగ్ మిగతా సూసైడ్ క్లబ్ సభ్యులుగా నటించారు. ఈ చిత్రానికి రైటర్ మరియు డైరెక్టర్: శ్రీనివాస్ బొగడపాటి, ప్రొడ్యూసర్: 3 i ఫిలిమ్స్ అండ్ ప్రవీణ్ ప్రభు వెంకటేశం, మ్యూజిక్: కున్ని గుడిపాటి, ఎడిటర్: డే సెల్వ, ఆర్ట్: శాన్ నవార్, విజువల్స్: పవన్ కుమార్ తడక, కుమార్ నిర్మల సృజన్, సౌండ్: రాఘవ చరణ్.


