తగ్గేదేలేదంటున్న బన్నీ, సుక్కూ

Published on Apr 27, 2021 12:15 pm IST

టాలీవుడ్ పరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘పుష్ప’ కూడ ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జు చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్ లుక్, టీజర్ ఇలా అన్నీ ఆకట్టుకోవడం, బన్నీ మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రేక్షకులు, అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మొదటి లాక్ డౌన్ మూలంగా ఇప్పటికే సినిమా ఆలస్యం అయింది. అందుకే సుక్కూ టీమ్ కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి కూడ భయపడకుండా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారు.

సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఇండస్ట్రీలో పెద్ద సినిమాలన్నీ నిలిచిపోయాయి. ఆలస్యమైనా పర్వాలేదు అంతా కుదురుకున్నాకే షూటింగ్ చేద్దామని అనుకుంటున్నారు హీరోలు, దర్శకులు. కానీ సుకుమార్, బన్నీ మాత్రం రిస్క్ చేసైనా సరే సినిమాను అనుకున్న సమయానికి కంప్లీట్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుగుతోంది. బన్నీ, సుకుమార్ కమిట్మెంట్ చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం కలుగకమానదు. చూడబోతే సుకుమార్ చెప్పినట్టే ఆగష్టు 13వ తేదీకి సినిమాను విడుదలచేసి తీరేలా ఉన్నారు.

సంబంధిత సమాచారం :