రంగస్థలం రంగమత్త..బన్నీ కోసం కూడానా..?

Published on Jan 18, 2020 1:11 pm IST

ప్రస్తుతం అల వైకుంఠపురంలో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ షెడ్యూల్ నందు పాల్గొంటారు. సుకుమార్ ఇప్పటికే కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. కేరళ షెడ్యూల్ నందు అల్లు అర్జున్ పాల్గొనలేదు. ఈ చిత్రంలో బన్నీకి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా, తమిళ వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి విలన్ రోల్ చేస్తున్నారు. ఐతే ఈ మూవీ కాస్టింగ్ లో పాపులర్ యాంకర్ కమ్ యాక్టర్ అనసూయ కూడా జాయిన్ అయ్యారట.

రంగస్థలం చిత్రంలో రామ్ చరణ్ ప్రేమగా రంగమత్త అని పిలుచుకునే ప్రాముఖ్యం ఉన్న పాత్ర ఇచ్చిన సుకుమార్,బన్నీ మూవీలో కూడా అలాంటి ఓ రోల్ ఆమెకు సిధ్దం చేశారట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం శేషాచలం అడవులలో జరిగే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More