‘1 నేన్నోకిడినే’ చిత్రం హిందిలో ‘ఎక్ కా దమ్’ గా డబ్బింగ్ జరుపుకుని విడుదల కానుంది. గత నెలలో ట్రైలర్ విడుదలఅయిన ఈ చిత్రం విడుదల తేది ఇంకా ప్రకటించాల్సి వుంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం మంచి రివ్యూస్ రాబట్టుకున్న ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “నిర్మాతలు ఈ చిత్రాన్ని హింది లో మహేష్ బాబు హీరో గా రీమేక్ చేద్దాం అని లేకపోతే డబ్బింగ్ చేసి విడుదల చేయాలని ఆలోచించారు ఈ డబ్బింగ్ వెర్షన్ లో సినిమా నిడివి మినహా పెద్దగా మార్పులు వుండవు. ప్రస్తుతం నేను నా తర్వాతి చిత్రాల మీద ద్రుష్టి పెడుతున్నాను. యెన్టీఆర్ తో ఒక చిత్రంచేయబోతున్నాను. నేను ఒక తెలుగు చిత్రం హిందిలో రీమేక్ చేయవలసివస్తే ‘ఆర్య 2’ ని చేస్తాను. కాని ఏ విషయం ఇంకో రెండు నెలల వరకు ఖచ్చితంగా చెప్పలేను”.


