లొకేషన్ల వేటలో సుకుమార్ !

Published on May 7, 2019 4:30 pm IST

ఆర్య సిరీస్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజి లో వున్నా ఈ చిత్రం ఈనెల 11న లాంచ్ కానుంది. ఇక ఈ చిత్రం కోసం సుకుమార్ ప్రస్తుతం లొకేషన్స్ ను వెతికేపనిలో ఉన్నాడు. అందులో భాగంగా తిరుమల అడవుల్లో సుకుమార్ రెక్కీ నిర్వహిస్తున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్డ్ డ్రాప్ లో తెరకెక్కనున్న చిత్రం కావడంతో సుక్కు ఈ సినిమా కోసం అక్కడి లొకేషన్స్ ను ఎంచుకున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇక ప్రస్తుతం బన్నీ,త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి బన్నీ ,సుకుమార్ సినిమాను మొదలుపెట్టనున్నాడు.

సంబంధిత సమాచారం :

More