సుకుమార్ నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా ?

సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా సుకుమార్ స్థాయి ఏంటో ‘రంగస్థలం’ చిత్రంతో పూర్తిస్థాయిలో బయటపడింది. వాస్తవికమైన కథ, పాత్రలతో ఆయన సినిమాను తీసిన తీరు, కథానాయకుడు చిట్టిబాబు పాత్రను నడిపిన విధానం ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటికి తోడు చరణ్ సమానాయమైన నటన వలన చిత్రం కలెక్షన్ల పరంగా ‘బాహుబలి-1, 2’ ల తర్వాత మూడవ స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది.

ఇకపోతే సుకుమార్ తన తర్వాతి సినిమాను కూడ పెద్ద హీరోతోనే చేస్తానని ఒకసారి, తనకు ప్రభాస్ తో పనిచేయాలని ఉందని ఒకేసారి అన్నారు. దీంతో సుకుమార్ నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనని, ఇప్పటికే వీరి మధ్యన చర్చలు జరిగాయని, ఇద్దరూ కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కేవలం ఊహాగానాలుగా మాత్రమే ఉన్న ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే సుకుమార్ లేదా ప్రభాస్ ల నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వేచి చూడాలి.