
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిత్రసీమలో ప్రవేశించి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ‘సౌందర్యలహరి’. మౌని ముని అంటూ తెలుగు ప్రముఖులు పిలిచే రాఘవేంద్రుడు తొలిసారిగా తన గళం విప్పి ఈ కార్యక్రమంలో అనేక సంగతులు, స్వర్ణోత్సవ సినిమా విశేషాలను వెల్లడిస్తున్నారు.
‘సౌందర్యలహరి’ కార్యక్రమం ప్రారంభం నుండి లాస్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఆమెను తొలగించి ఆ స్థానంలో ప్రముఖ యాంకర్ సుమను తీసుకున్నారు. గత కొన్ని ఎపిసోడ్ ల నుండి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోలు. క్రేజీ హీరోయిన్లు, ప్రముఖ దర్శకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయినా, ఆశించిన రీతిలో టి.ఆర్.పి రేటింగ్ లు లేకపోవడంతో యాంకర్ ను చేంజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం, వెంటనే అమలు చేయడం చకచకా జరిగిపోయాయి. సుమ రాకతో ‘సౌందర్యలహరి’కి ఎంత వరకు ప్రయోజనం చేకురుతుందో వేచి చూడాలి.