అక్కినేని హీరో కొత్త మూవీ టైటిల్…?

Published on Nov 18, 2019 10:17 am IST

అక్కినేని నాగేశ్వర రావు వారసులతో నాగార్జున తరువాత అంత గ్రాండ్ గా లాంచ్ ఐయ్యారు హీరో సుమంత్. గౌరీ, సత్యం,గోదావరి వంటి హిట్ మూవీస్ తో ఆయన హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఐతే సుమంత్ ఓ మంచి హిట్ అందుకొని చాలా కాలం ఐయ్యింది. ఈఏడాది ఆయన బాలయ్య హీరోగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలలో తాత ఏఎన్ఆర్ పాత్ర చేయడం జరిగింది. ఐతే ఈరెండు చిత్రాలు అనూహ్యంగా పరాజయం చవిచూశాయి.

కాగా సుమంత్ హీరోగా ఓ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈమూవీని దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తుండగా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ ని నేడు కింగ్ నాగార్జున విడుదల చేయనున్నారు. నేడు సాయంత్రం 5:00గంటలకు సుమంత్ నూతన చిత్ర టైటిల్ పోస్టర్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మిగతా నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

More