25వ సినిమాను మొదలుపెట్టనున్న సుమంత్ !
Published on Mar 13, 2018 10:47 am IST

‘మళ్ళీ రావా’ విజయంతో సరికొత్త ఉత్సాహాన్ని అందుకున్న హీరో సుమంత్ త్వరలో తన 25వ సినిమాను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. మార్చి 18న ఉగాది పర్వదినం సందర్బంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్రం ప్రారంభంకానుంది.

నూతన దర్శకుడు జాగర్లపూడి సంతోష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డి బీరంలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలొనే ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే సుమంత్ ప్రస్తుతం కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

 
Like us on Facebook